Naked Protest: నగ్నంగా ధర్నాకు రెడీ..!
Hyderabad: న్యాయం కోసం ఎంతో మంది నిరసనలకు, ధర్నాలకు పాల్పడుతుంటారు. కొందరైతే ఆత్మహత్యాయత్నానికి (naked protest) పాల్పడ్డాలు వంటివి చేస్తుంటారు. కానీ నగ్నంగా ధర్నాలు చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా? వినే ఉంటారు కానీ మన దేశంలో అయితే ఇలాంటివి జరగవు. విదేశాల్లో ఇవి కామన్. అయితే మన దేశంలో ఏ విషయంలో అయినా న్యాయం జరగడానికి నగ్నంగా ధర్నాలు చేయడానికి ఓ గ్రూప్ ఉంది తెలుసా? ఆ గ్రూప్‌లో 12 మంది మహిళలు ఉంటారు. 19 ఏళ్ల క్రితం వీరంతా కలిసి నగ్నంగా ధర్నాలు చేస్తే తప్ప న్యాయం జరగలేదు. ఇప్పుడు వీళ్లు వృద్ధులైపోయారు. అయినా కూడా మణిపూర్‌లో (manipur) జరుగుతున్న అల్లర్లకు, ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించి రేప్ చేసి చంపేసినందుకు న్యాయం జరగడం కోసం మళ్లీ నగ్నంగా ధర్నా చేయడానికి సిద్ధం అంటున్నారు. (naked protest)
అసలు ఎవరు వీళ్లు?
అది 2004. మణిపూర్‌కి చెందిన తంగ్జమ్ మనోరమ అనే యువతిని అక్కడి సెక్యూరిటీ బలగాలు రేప్ చేసి చంపేసారట. ఆమెకు న్యాయం జరగాలని, ఆడవారిపై ఇలాంటి దారుణాలకు అరికట్టాలని డిమాండ్ చేస్తూ 12 మంది మహిళలు నగ్నంగా ధర్నా చేసారు. అప్పట్లో అది ఎంత సంచలనం సృష్టించిందంటే.. ఇంటర్నేషనల్ మీడియా కూడా కవర్ చేసింది. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ మణిపూర్‌లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. కుకి తెగకు చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించడమే కాకుండా రేప్ చేసి చంపేసారు. పైగా ఆ దారుణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేసారు. దాంతో మణిపూర్ అట్టుడికిపోతోంది. ఇప్పుడు ఈ మహిళలకు న్యాయం జరగాలని కోరుకుంటూ ఆ 12 మంది మహిళలు మళ్లీ నగ్న ప్రదర్శన చేయడానికి సిద్ధం అంటున్నారు. (naked protest) నగ్నంగా ధర్నా చేసే ధైర్యం ఉన్నా.. ఇప్పుడు వారి వయసు సహకరించడంలేదు. దాంతో వెంటనే వారికి న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నారు.