Heavy Rains: తెలంగాణలో ఈ 5 జిల్లాలకు రెడ్ అలెర్ట్
Heavy Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలలో మోస్తారు వర్షాలు మరికొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ జిల్లాలలకు అతి భారీ వర్ష సూచన ఉండటంతో రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
అదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలలో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు.
యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఎం.మల్కాజ్ గిరి జిల్లాలకు మోస్తారు వర్షం సూచన ఉండటంతో ఎల్లో అలెర్ట్ ప్రకటించారు. ఇలా మొత్తం 7 జిల్లాలకు రెడ్ కలర్, 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు. ఉరుములు మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవ్వరూ బయటికి రావద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.