Jobs: వింత ఉద్యోగాలు.. లక్షల్లో జీతాలు..!
Hyderabad: మనకు తెలిసినంత వరకు ఉద్యోగాలు(jobs) అంటే సాఫ్ట్‌వేర్, కంటెంట్, సేల్స్.. వంటివే ఉన్నాయి. కానీ మనకు తెలీని వింత ఉద్యోగాలు(odd jobs) ఉన్నాయి. వాళ్లకు జీతం కూడా లక్షల్లో ఉంటుందట. ఇంతకీ ఆ ఉద్యోగాలు ఏంటంటే..
ఐస్‌క్రీం టేస్టర్
అంటే ఐస్‌క్రీం టేస్ట్ చేస్తే చాలు నెలనెలా జీతం పడిపోతుంది. కాకపోతే ఊరికే టేస్ట్ చేసి బాగుంది అని చెప్తే సరిపోదు. అన్ని పదార్థాలు ఉన్నాయా, టెక్చర్, ఫ్లేవర్ సరిపోయాయా అనేవి పక్కాగా చెప్పగలగాలి. ఇందుకోసం డైరీ సైన్స్, ఫుడ్ సైన్స్‌లో డిగ్రీ చేసి ఉండాలి.
వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్
ఇది అందరికీ తెలిసిందే. కానీ ఈ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌కి విదేశాల్లో ఉండే డిమాండే వేరు. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కంటే ఎక్కువగా వీళ్లు సంపాదిస్తుంటారు.
ఫుడ్ స్టైలిస్ట్
ఫుడ్ వండగానే సరిపోదు. కస్టమర్లకు ప్లేట్ చూడగానే నోరూరాలి. ఫుడ్ స్టైలిస్ట్‌ను ప్లేట్‌ను అందంగా డిజైన్ చేస్తే వాటిని ఫొటోషూట్స్, టీవీ యాడ్స్‌కి వాడుకుంటారు. అలా వారి డిమాండ్‌ని బట్టి డబ్బులిస్తుంటారు.
ఎథికల్ హ్యాకర్
హ్యాకింగ్ అనేది నేరం. కానీ కొన్ని ప్రభుత్వాలు ఇతర ఇల్లీగల్ హ్యాకర్ల వలలో పడకుండా ఉంటానికి ఎథికల్ హ్యాకర్లను ఎంపికచేసుకుంటారు. సైబర్ సెక్యూరిటీ కంపెనీల్లో ఎథికల్ హ్యాకర్లకు లక్షల్లో సంపాదన ఉంటుంది.
ప్రొఫెషనల్ స్లీపర్
హాయిగా నిద్రపోతే జీతం వచ్చేస్తుంది. అవును. నిద్రపై రీసెర్చ్‌లు చేయడానికి కొందరు మనుషులను ఎంపికచేసుకుని వారికి అన్ని సదుపాయాలతో పాటు జీతం ఇచ్చి మరీ నిద్రపోవాలని చెప్తుంటారు. కానీ దొంగ నిద్రపోతే మాత్రం ఇట్టే పసిగట్టేస్తారు.