Career: ఈ కోర్సుల‌తో రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు జీతం

these courses will help you get a to get a 50 lakh salary job

Career: కొన్ని సార్లు మంచి ఉద్యోగం రావాలంటే కేవ‌లం చ‌దువులో ఫ‌స్ట్ వ‌స్తే స‌రిపోదు. దానికి త‌గ్గ నైపుణ్యాలు కూడా ఉండాలి. యావ‌రేజ్ స్టూడెంట్స్ కూడా ఈరోజుల్లో నెల‌కు 2 ల‌క్ష‌ల‌కు పైగా సంపాదించేస్తున్నారంటే అందుకు కార‌ణం మార్కెట్ ట్రెండ్స్‌, స్కిల్స్‌పై వారికి ప‌ట్టు ఉండ‌ట‌మే. కొన్ని ర‌కాల కోర్సుల‌పై బాగా అవ‌గాహ‌న ఉంటే రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు వార్షిక వేత‌నాన్ని పొందే అవ‌కాశం ఉంటుంది. అవేం కోర్సులో తెలుసుకుందాం.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్

టెక్నాల‌జీ రంగంలో AI దూసుకుపోతోంది. C++, పైతాన్, జావా వంటి కోడింగ్ స్కిల్స్ బాగా ఉండేవారు ఈ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ కోర్స్‌కు సులువుగా అప్లై చేసుకోవ‌చ్చు. కోర్సు పూర్త‌య్యాక ఫ్రెష‌ర్‌గా ఉద్యోగాల‌కు అప్లై చేసినా స్టార్టింగ్‌లోనే సంవ‌త్స‌రానికి రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు ప్యాకేజ్ ఇస్తున్నార‌ట. ఇక ఇందులో ఆల్రెడీ అనుభ‌వం ఉన్న‌వారు ఏడాదికి రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు అర్జిస్తున్నారు.

డేటా సైన్స్

ఇప్పుడు మార్కెట్‌లో డేటా సైంటిస్ట్‌ల‌కు ఉన్న డిమాండ్ మామూలుగా లేదు. ఎంత జీతం కావాల‌న్నా ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నారు. స్టార్టింగ్ శాల‌రీ రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంది. అనుభ‌వం ఉంటే ట్రిపుల్ ఇస్తారు.

ఫైనాన్స్, బిజినెస్ కోర్సులు

ఈ కోర్సుతో స్టాక్ మార్కెట్, బ్యాంకింగ్, కార్పొరేట్ బిజినెస్, ఇన్‌వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ రంగాల్లో మంచి ఉద్యోగాలు చేసుకోవ‌చ్చు. ఈ కోర్సు నేర్చుకోవాలంటే ముందు ఎన‌లిటిక‌ల్ స్కిల్స్ ఉండాలి. ఈ రంగాల్లో జీతం రూ.4 నుంచి రూ.34 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంది.

ఎన్విరాన్మెంట‌ల్ సైన్స్

గ్లోబ‌ల్ వార్మింగ్ పెరిగిపోవ‌డంతో వాతావ‌ర‌ణ మార్పుల‌కు సంబంధించిన అంశాల‌పై రీసెర్చ్ చేసేందుకు ఉద్యోగుల‌ను నియ‌మించుకుంటున్నారు. ఫ్రెష‌ర్స్‌కి ఏడాదికి రూ.2.5 ల‌క్ష‌ల నుంచి అనుభ‌వం ఉన్న‌వారికి రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు జీతాలు ఇస్తున్నారు.

సైబ‌ర్ సెక్యూరిటీ కోర్సులు

సైబ‌ర్ నేరాలు ఈరోజుల్లో ఏ స్థాయిలో పెరిగిపోయో చూస్తూనే ఉన్నాం. ఇందుకోసం సైబ‌ర్ సెక్యూరిటీ నిపుణుల‌ను ఎంపిక చేసుకునే సంస్థ‌లు ఎక్కువ‌గా ఉన్నాయి. ఏడాదికి రూ.8 నుంచి రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు జీతాలు ఇస్తున్నారు.