Highest Tax Payers: దేశంలోనే అత్యధిక పన్ను కట్టింది ఇతనే..!
Highest Tax Payers: మన దేశంలో పని చేసే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో పన్ను చెల్లిస్తూనే ఉంటారు. ఉద్యోగాలు చేసేవారికన్నా వ్యాపారాలు, సినిమా రంగం వాళ్లు, క్రీడా రంగంలోని వాళ్లు కట్టే పన్ను శాతమే ఎక్కువ. మన దేశంలో అత్యధికంగా పన్ను కట్టే సెలబ్రిటీ ఎవరో తెలుసా? బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్. ఫార్చ్యూన్ ఇండియా బయటపెట్టిన నివేదిక ప్రకారం షారుక్ ఖాన్ ఈ ఏడాది రూ.92 కోట్ల పన్ను కట్టారట.
అత్యధికంగా పన్ను కట్టిన వారు వీరే
షారుక్ ఖాన్ – 92 కోట్లు
తమిళ నటుడు విజయ్ – 80 కోట్లు
సల్మాన్ ఖాన్ – 75 కోట్లు
అమితాబ్ బచ్చన్ – 71 కోట్లు
విరాట్ కోహ్లీ – 66 కోట్లు
అజయ్ దేవగణ్ – 42 కోట్లు
ఎంఎస్ ధోనీ – 38 కోట్లు
రణ్‌బీర్ కపూర్ – 36 కోట్లు
హృతిక్ రోషన్ – 28 కోట్లు
సచిన్ తెందుల్కర్ – 28 కోట్లు
సౌరవ్ గంగూలీ – 23 కోట్లు
కరీనా కపూర్ – 20 కోట్లు
అల్లు అర్జున్ – 14 కోట్లు
హార్దిక్ పాండ్య – 13 కోట్లు