Supreme Court: సేమ్ సెక్స్ రిలేషన్‌షిప్స్‌లో ఎలాంటి తప్పు లేదు కానీ…
కొంతకాలంగా స్వలింగ సంపర్క వివాహాలపై (same sex marriage) వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం (supreme court) ఈరోజు తీర్పు వెల్లడించింది. సాధారణ జంటలకు కల్పించిన బనిఫిట్స్.. స్వలింగ సంపర్క జంటలకు కల్పించకపోతే అది వారి హక్కులకు భగ్నం కలిగించినట్లేనని భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తెలిపారు. ఐదుగురు న్యాయమూర్తులు కలిసి ఈ అంశంపై సుదీర్ఘ వాదనలు విని మే నెలలో తీర్పును రిజర్వ్ చేసారు. ఆ తీర్పును ఈరోజు వెల్లడించారు. ఐదుగురు న్యాయమూర్తులు కలిసి నాలుగు తీర్పులు వెల్లడించనున్నట్లు చంద్రచూడ్ తెలిపారు.
సుప్రీంకోర్టు వెల్లడించిన కీలక అంశాలు ఇవే..!
పెళ్లి చేసుకోకుండా ప్రేమలో ఉంటే వారి బంధం నిజమైనది కాదు అనడానికి వీల్లేదు.
స్వలింగ సంపర్క జంటను న్యాయస్థానం ఏ విషయంలోనూ తక్కువ చేసి చూడలేదు. సాధారణ జంటలకు సమాజం కల్పించిన అన్ని బెనిఫిట్స్ స్వలింగ సంపర్క జంటలకు కూడా వర్తిస్తాయి. అలా చేయకపోతే వారి హక్కులకు భంగం కలిగించినట్లే అవుతుంది.
అన్ని రకాల జంటలకు తమ జీవితాలు ఎలా ఉండాలో నిర్ణయించుకునే హక్కు ఉంటుంది.
జీవితంలో ఓ బంధంలోకి అడుగుపెట్టడం అంటే సరైన వ్యక్తిని ఎంచుకోవడం. ఈ విషయంలో స్వలింగ సంపర్కులను వేరు చేసి చూడటం తప్పు.
పెళ్లి అనేది ఇద్దరు ఆపోజిట్ లింగాల మధ్య జరిగేది మాత్రమేనని ఎక్కడా రాయలేదు. మారుతున్న జీవనశైలితో పాటు వివాహ వ్యవస్థలోనూ మార్పులు జరిగాయి.
వివాహ వ్యవస్థలో మార్పులు తీసుకురావడం అనేది పార్లమెంట్ తీసుకోవాల్సిన నిర్ణయం. ఈ విషయంలో సుప్రీంకోర్టు కలగజేసుకోవడంలేదు.
పెళ్లి కాని జంటలు.. స్వలింగ సంపర్క జంటలు కూడా పిల్లలను దత్తత తీసుకోవచ్చు.
2018లో సుప్రీంకోర్టు స్వలింగ సంపర్క రిలేషన్‌షిప్స్ విషయంలో తీర్పునిస్తూ.. వారు ప్రైవేట్‌గా రిలేషన్‌షిప్‌లో ఉంటే దానిని నేరంగా పరిగణించకూడదని వెల్లడించింది. ఇప్పుడు తాజాగా వెల్లడించిన తీర్పులో భాగంగా.. స్వలింగ సంపర్క జంటలపై దాడులు, ధూషణలు జరగకుండా భేదభావ విరోధ చట్టాన్ని తీసుకురావాలని అన్నారు. దీనిపై చంద్రచూడ్ మాట్లాడుతూ.. ఈ భేదభావ విరోధ చట్టం అనే అంశాన్ని తాను సపోర్ట్ చేయడంలేదని.. ఎందుకంటే ఒకవేళ చట్టం తీసుకురావాలన్నా ఎలాంటి అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు అనే విషయంపై క్లారిటీ లేదని వెల్లడించారు. (same sex marriage)