Supreme Court: రేప్ కేసు ఆడవాళ్లకు కూడా వర్తిస్తుందా?
Supreme Court: ఇప్పటివరకు రేప్ కేసు మగవారిపైనే పెట్టడం చూసాం. కానీ మొదటిసారి రేప్ కేసు అనేది ఆడవారికి కూడా వర్తిస్తుందా లేదా అనే అంశంపై సర్వోన్నత న్యాయస్థానం పరిశీలించనుంది. పంజాబ్‌కు చెందిన ఓ యువతి అమెరికాలో ఉంటున్న ఓ అబ్బాయిని ప్రేమించింది. వీరిద్దరూ వర్చువల్‌గా మాట్లాడుకునేవారు కానీ ఎప్పుడూ కలుసుకోలేదు. ఈ నేపథ్యంలో ఆ యువతి అబ్బాయి తల్లిని కలిసి పెళ్లి చేసుకుంటానని చెప్పింది. దాంతో వారిద్దరూ వర్చువల్‌గానే పెళ్లి చేసుకున్నారు. అప్పటినుంచి ఆ యువతి తన అత్తగారితోనే కలిసి ఉంటోంది.
ఈ నేపథ్యంలో పోర్చుగల్‌లో ఉన్న ఆ మహిళ రెండో కుమారుడు పంజాబ్ వచ్చాడు. ఆ సమయంలో ఏం జరిగిందో తెలీదు కానీ పెద్ద కొడుకుతో వివాహం రద్దు చేసుకుంటానని ఆ యువతి అత్తగారితో చెప్పింది. ఇందుకు అత్తగారు ఒప్పుకోలేదు. దాంతో తన ఇంట్లోవారిని పిలిపించి నానా హంగామా చేసింది. పైగా అత్తగారి నుంచి రూ.11 లక్షలు తీసుకుని పెద్ద కొడుకుతో వివాహాన్ని రద్దు చేసుకుంది. ఆ తర్వాత చిన్న కుమారుడిపై కన్నేసి వెళ్లేటప్పుడు తనను కూడా పోర్చుగల్‌కు తీసుకెళ్లాలని ఆ యువతి కోరింది. ఇందుకు అతను ఒప్పుకోకుండా ఒంటరిగా వెళ్లిపోయాడు. నిజానికి ఆ అబ్బాయి యువతికి మరిది అవుతాడు. అతనితో ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇక వేరే ఆప్షన్ లేక ఎలాగైనా అత్తగారిని ఇరికించాలని ప్లాన్ వేసి అత్తగారిపై మరిదిపై రేప్ కేసు వేసింది. దాంతో ఆ పెద్దావిడ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో అసలు మహిళపై రేప్ కేసు వర్తిస్తుందో లేదో పరిశీలించాల్సిందిగా సుప్రీంకోర్టు పంజాబ్ హైకోర్టును కోరింది. త్వరలో ఈ కేసును విచారించి డాక్యుమెంట్లు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది.