IAS vs IPS: ఇద్దరు ఆడపులుల మధ్య నలుగుతున్న సుప్రీంకోర్టు..!
IAS vs IPS: కర్ణాటకకు చెందిన IAS అధికారిణి రోహిణి సింధూరి (rohini sindhuri), IPS అధికారిణి రూపల (roopa) మధ్య అసభ్యకరమైన రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి గొడవలోకి సర్వోన్నత న్యాయస్థానం (supreme court) తలదూర్చాల్సి వచ్చింది.
అసలు ఏం జరిగింది?
రోహిణి, రూపలు సివిల్ సర్వెంట్లుగా ఉన్నత స్థానాల్లో ఉన్నారు. కర్ణాటకలో ఎన్నికల ముందుకు వీరిద్దరి మధ్య ఏదో అంశంలో వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో సాటి ఆడది అని కూడా చూడకుండా రూప.. రోహిణికి సంబంధించిన పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇదంతా తాను తన కుటుంబాన్ని కాపాడుకోవడానికే చేస్తున్నాను అని రూప అంటున్నారు. మరోపక్క రూప తన వ్యక్తిగత ఫోటోలను బట్టబయలు చేసినందుకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. దాంతో ఎన్నికలకు ముందు మాజీ సీఎం బసవరాజు బొమ్మై ఈ ఇద్దరు ఆడవాళ్ల గొడవతో తలపట్టుకున్నారు. ఇద్దరినీ వేరే ప్రాంతాలకు బదిలీ చేస్తే సమస్య తీరిపోతుంది అనుకున్నారు ఇంకా ముదిరిపోయింది. (IAS vs IPS)
రూప తన భర్తతో విడిపోయారని రోహిణి అందరికీ రూమర్స్ క్రియేట్ చేసారట. దాంతో రూపకు ఒళ్లు మండి రోహిణి వ్యక్తిగత అంశాలను ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసారు. ఇప్పటికే రోహిణి తన ఫోటోలను డిలీట్ చేయాల్సిందిగా రూపకు నోటీసులు పంపారు. అయినా రూప డిలీట్ చేయలేదు. దాంతో వీరి గొడవ సుప్రీంకోర్టుకెక్కింది.
సుప్రీంకోర్టు ఏమంటోంది?
ఈ నెల 13న సుప్రీంకోర్టు ఈ కేసు వాదనలు వింటూ కోర్టు బయట సెటిల్ చేసుకోవాల్సిన అంశాన్ని కూడా ఇంత దాకా ఎందుకు తెచ్చుకుంటారు అని మందలించారు. కోర్టు బయట వారి గొడవ ఒకరినొకరు చంపుకునేదాకా వెళ్లిందని ఇద్దరి తరఫు న్యాయవాదులు వాదించడంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ముందు రూపను రోహిణికి సంబంధించిన వ్యక్తిగత ఫోటోలను డిలీట్ చేయాలని ఆదేశించారు. ఇద్దరు బాధ్యతగల అధికారిణులు రాష్ట్రాన్ని కాపాడకుండా ఇలా కొట్టుకుంటే ఇక ప్రజలకు ఏం చేస్తారు అని న్యాయస్థానం మందలించింది. ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. (IAS vs IPS)