Income Tax: మన దేశంలో ట్యాక్స్ కట్టని ఏకైక రాష్ట్రం ఇదే
Income Tax: మన భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలోని పౌరులు ప్రభుత్వానికి ఎంతో కొంత పన్ను కడుతూనే ఉంటారు. అయితే ఈ ఒక్క రాష్ట్రం నుంచి మాత్రం ఎలాంటి పన్ను కేంద్ర ప్రభుత్వానికి చేరదు. ఆ రాష్ట్రం ఏది.. ఎందుకు పన్ను కట్టడంలేదు? వంటి విషయాలను తెలుసుకుందాం.
ఇంతకీ అదేం రాష్ట్రం అంటే సిక్కిం. 1975 నాటికి ముందు సిక్కిం అసలు భారతదేశంలోని రాష్ట్రమే కాదు. అదొక యునైటెడ్ కింగ్‌డం. సిక్కింను భారత్‌లో భాగంగా చేసుకుంటున్న సమయంలోనే ఆ రాష్ట్రం తమ ప్రత్యేక హోదా అలాగే ఉంటుందని.. ఇతర రాష్ట్రాలు అమలు చేసే ఏ విధానం కూడా తమ రాష్ట్రానికి వర్తించదు అని షరతు పెట్టింది. ఇందుకు భారత ప్రభుత్వం కూడా అంగీకరించింది. భారత్‌లో సిక్కిం కలవడానికి ముందే సొంత పన్ను విధానం ఉండేది. 1948లో ప్రవేశపెట్టిన సిక్కిం ఇన్‌కం ట్యాక్స్ మాన్యువల్ సిస్టమ్‌ను ఫాలో అవుతూ వస్తోంది. ఈ సిస్టమ్ ప్రకారం సిక్కిం రాష్ట్ర వాసులు ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వానికి పన్నుగా చెల్లించరు.
అయితే 2013లో సుప్రీం కోర్టు ఈ పన్ను విషయంపై కీలక తీర్పు ఇచ్చింది. 1975 ఏప్రిల్ 26 నాటికి ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి సిక్కింలో స్థిరపడ్డారో వారికి కూడా పన్ను మినహాయింపు ఇవ్వాలని ఆదేశించింది. అంతకుముందు వరకు కేవలం సిక్కిం వాసులకు మాత్రమే ఈ మినహాయింపు ఉండేది. అంతేకాదు సిక్కిం వాసులకు ప్యాన్ కార్డులు కూడా కంపల్సరీ కాదని SEBI ప్రకటించింది. సిక్కిం వాసులు పెట్టుబడులు పెట్టుకోవాలనుకుంటే ప్యాన్ కార్డులు లేకుండా కూడా పెట్టుకోవచ్చని తెలిపింది.