EXCLUSIVE: ఉచిత బ‌స్సు ప్ర‌యాణం.. కండ‌క్ట‌ర్ బ్యాగు చోరీ

EXCLUSIVE: ఏ ముహూర్తాన తెలంగాణ ప్ర‌భుత్వం ఉచిత బ‌స్సు ప్ర‌యాణ ప‌థ‌కం (free bus scheme) పెట్టిందో కానీ ఏదో ఒక వైర‌ల్ ఘ‌ట‌న జ‌రుగుతూనే ఉంది. తాజా ఘ‌ట‌న‌లో ఏకంగా కండ‌క్ట‌ర్ ప‌ర్సు కొట్టేసారు. మణుగూరు డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఖమ్మం నుంచి పాల్వంచ వెళుతుండగా టికెట్లు కొడుతున్న సమయంలో బాగా రద్దీ ఉంది. అదే సమయంలో కండక్టర్ బ్యాగులో ఉన్న రూ.9 వేలను ఎవరో మాయం చేశారు. ఈ విషయాన్ని గమనించిన బాధిత కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఆ సమయంలో బస్సులో 90 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.