Ujjain: ఫోటో చూసాక తెలిసింది రేప్‌కి గురైంది నా బిడ్డే అని..!
ఇటీవల ఉజ్జయిని (ujjain) ప్రాంతంలో ఓ బాలిక రక్తమోడుతూ అందరి ఇళ్ల వద్దకు వెళ్లి సాయం అడుగుతున్న ఫోటో, వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ బాలికను అత్యాచారం చేసి నిందితుడు పారిపోయాడు. దాంతో ఆ బాలిక ఓ చిన్న వస్త్రంతో తన శరీరాన్ని కప్పుకుని వీధిలోని అన్ని ఇళ్ల వద్దకు వెళ్లి సాయం కోరింది. కొందరు డబ్బులిచ్చి పంపిచేస్తే.. మరికొందరు అసహ్యించుకుని తలుపులేసుకున్నారు.
చివరికి ఓ పూజారి ఆ బాలికను చేరదీసి దుస్తులు ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ప్రస్తుతం ఆ బాలిక ఆరోగ్యం నిలకడగా ఉంది. నిందితుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. ఆ దాదాపు రెండు రోజుల తర్వాత ఆ బాలిక ఫోటోలు, వీడియోలు వార్తల్లో రావడంతో వాటిని ఓ బంధువు చూపించడంతో తన బిడ్డే అని గుర్తుపట్టాడు ఆ తండ్రి. సెప్టెంబర్ 24న తన కూతురు ఎప్పటిలాగే స్కూల్‌కు వెళ్లిందని.. ఆ తర్వాత ఎప్పటికీ తిరిగి రాలేదని తెలిపాడు. పరిసర ప్రాంతాల్లో ఎంత గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసామని పేర్కొన్నాడు.