Tesla: 7 గంటల పని.. రోజుకు 20 వేలకు పైగా జీతం
Tesla: గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికిల్ సంస్థ టెస్లా శుభవార్త చెప్పింది. 7 గంటల పాటు నడుస్తూ తాము డిజైన్ చేసిన రోబోకు శిక్షణ ఇప్పించగలిగితే రోజుకు రూ.28000 వరకు జీతం ఇస్తుందట. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి టెస్లా ఆప్టిమస్ అనే రోబోను తయారుచేసింది. ఈ రోబోకు డేటా కలెక్షన్ ఆపరేటర్ కావాలి. ఎంపికైన ఉద్యోగి మోషన్ క్యాప్చర్ సూట్ ధరించి వర్చువల్ రియాల్టీ హెడ్‌సెట్ పెట్టుకుని రోబోతో పాటు 7 గంటల పాటు నడవాల్సి ఉంటుంది.
ఎప్పటికప్పుడు రిపోర్టులు ప్రిపేర్ చేస్తూ డేటా కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి కొన్ని షరతులు విధించారు. ఒక్కో అభ్యర్ధి 5’7″ & 5’11” పొడవు ఉండాలి. దాదాపు 13 కిలోల వరకు బరువు మోయగలగాలి. ఈ ఉద్యోగానికి మొత్తం 3 షిఫ్ట్‌లు ఉంటాయి. 8:00 AM- 4:30 PM, 4:00 PM- 12:30 AM, లేదా 12:00 AM- 8:30 AM ఉంటాయి. ఉద్యోగం చేయాల్సిన ప్రదేశం కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో. జీతంలో పాటు మెడికల్ బెనిఫిట్స్, బీమా కూడా ఇస్తారు. ఆసక్తి ఉన్నవారు టెస్లా కెరీర్ పేజ్‌లో ఉన్న అప్లికేషన్ ఫాంను ఫిల్ చేసి పంపచ్చు.