కోరిక తీర్చలేదని పిన్నిని చంపేసిన పదో తరగతి విద్యార్థి
Bengaluru: కోరిక తీర్చలేదని 37 ఏళ్ల మహిళను దారుణంగా చంపేసాడు పదో తరగతి చదువుతున్న విద్యార్థి. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. దక్షిణ కన్నడ జిల్లాలోని ఉప్పినంగాడి పట్టణంలో 37 ఏళ్ల మహిళ మృతదేహం లభించింది. ఆమె చనిపోయిన సమయంలో పదేళ్ల బాలుడు అక్కడే ఉన్నాడు. కొంతకాలంగా ఆ బాలుడు సెక్స్ కోరికలు తీర్చాలని పిన్ని వరుస అయిన ఆ మహిళను టార్చర్ పెడుతున్నాడు. ఆమె అందుకు ఒప్పుకోకపోవడంతో నిద్రిస్తున్న సమయంలో తలగడతో ఊపిరి ఆడకుండా చేసి చంపేసాడు.
ఆమె చనిపోయింది అని నిర్ధారించుకున్నాక తన తండ్రితో పిన్ని తన కళ్లముందే గుండెపోటుతో చనిపోయిందని చెప్పాడు. ఇదే విషయాన్ని బాలుడి తండ్రి పోలీసులకు చెప్పగా.. వారికి అనుమానం వచ్చింది. బాలుడి వీపు భాగంలో గోళ్లతో గీకినట్లు కూడా ఉండటంతో పోలీసులకు అనుమానం కలిగింది. దాంతో బాలుడిని స్టేషన్కు తీసుకెళ్లి విచారించగా అసలు విషయం చెప్పాడు. తన కోరిక తీర్చనందుకే చంపేసానని వెల్లడించడంతో పోలీసులతో పాటు తల్లిదండ్రులు కూడా షాకయ్యారు. బాలుడిని అరెస్ట్ చేసి జువెనైల్ హోంకు తరలించారు.