Himachal Pradesh: శివ‌య్యా.. కాపాడ‌య్యా…

Shimla: హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో (himachal pradesh) కుండ‌పోత వ‌ర్షాల కార‌ణంగా కొండ‌చ‌రియ‌లు (landslides) విరిగి ప‌డ‌టంతో ఓ శివుడి ఆల‌యం (temple) కుప్ప‌కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఇప్ప‌టివ‌ర‌కు 9 మంది మృతిచెందారు. ఇంకా శిథిలాల కింద 20 మంది చిక్కుకున్న‌ట్లు తెలుస్తోంది. పోయిన ప్రాణాల‌ను ఎటూ తీసుకురాలేం. క‌నీసం రాళ్ల కింద ఉన్న‌వారినైనా ర‌క్షించ‌య్యా శివ‌య్యా అంటూ స్థానికులు ప్రార్థ‌న‌లు చేస్తున్నారు.

గ‌త 24 గంట‌ల్లో హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో (himachal pradesh) కురిసిన వ‌ర్షాల‌కు మొత్తం 16 మంది మృత్యువాత‌ప‌డ్డారు. స్థానిక సోల‌న్ ప్రాంతంలో వ‌ర్షాల వ‌ల్ల జ‌రిగిన ప్ర‌మాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చ‌నిపోయారు. కొన్ని ఇళ్లు వ‌ర‌ద‌ల్లో కొట్టుకుపోయాయి. భారీ వ‌ర్షాల కార‌ణంగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని 700 రోడ్ల మార్గాల‌ను మూసేసారు. వ‌ర్షాలు త‌గ్గేవ‌ర‌కు ప్ర‌జ‌లు ఎవ్వ‌రూ కూడా బ‌య‌ట అడుగుపెట్ట‌కూడ‌ద‌ని హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి సుఖ్వీంద‌ర్ సింగ్ సుక్కు ప్ర‌క‌టించారు.