కజకిస్థాన్లో తెలుగు విద్యార్థులకు ప్రాణహాని
Kazakhstan: కజకిస్థాన్లో భారతీయ విద్యార్ధులు బిక్కుబిక్కు మంటూ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా తెలుగు విద్యార్థులకు ప్రాణ హాని ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు దుండగులు భారతీయ విద్యార్థులను మాత్రమే టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. వారు ఎక్కడ కనిపిస్తున్నా తుపాకీలతో కాల్చడాలు, గాయపరచడాలు వంటివి చేస్తుండడంతో అక్కడ తమ పిల్లల పరిస్థితిపై భారతదేశంలోని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కజకిస్థాన్ దౌత్యకార్యాలయానికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ లేఖ రాసారు. అక్కడ ఉంటున్న తెలుగు విద్యార్థులను సురక్షితంగా భారత్కు పంపించాలని లేఖలో కోరారు. లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అనే పేరుతో ఈ దాడులు జరుగుతున్నాయని అక్కడి విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తమ పరిస్థితులను వెల్లడిస్తున్నారు.