USA: తెలుగు విద్యార్థిపై దాడి.. బ‌తికే ఛాన్స్ 5% ఉంద‌ట‌

America: అమెరికాలో (usa) తెలుగు విద్యార్థిపై హ‌త్యాయ‌త్నం జ‌రిగింది. ఇండియానాలోని వాల్ప‌రైసో న‌గ‌రంలోని ఓ జిమ్‌లో జోర్డాన్ ఆడ్రాడ్ అనే 24 ఏళ్ల వ్య‌క్తి అదే జిమ్‌లో వ‌రుణ్ (varun) అనే వ్య‌క్తిపై క‌త్తితో దాడి చేసాడు. వ‌రుణ్ త‌ల భాగంలో క‌త్తి గాట్లు ప‌డ‌టంతో అతని ప‌రిస్థితి విషమంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. వ‌రుణ్ బ‌తికే ఛాన్స్ జీరో నుంచి 5% వ‌ర‌కు మాత్ర‌మే ఉంద‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. జిమ్‌కి వెళ్లి మసాజ్ కావాల‌ని ఓ వ్య‌క్తిని అడిగాన‌ని.. అత‌ను వేరే వ్య‌క్తి ద‌గ్గ‌రికి వెళ్ల‌మ‌ని చెప్పాడ‌ని.. ఆ వ‌రుణ్ అనే వ్య‌క్తి ద‌గ్గ‌రికి వెళ్తే అత‌ను కాస్త విచిత్రంగా ప్ర‌వ‌ర్తించాడ‌ని తెలిపాడు. ఎందుకైనా మంచిద‌ని త‌న ద‌గ్గ‌రున్న క‌త్తితో పొడిచేసాన‌ని అన్నాడు.