అమెరికాలో హైద‌రాబాద్ విద్యార్థిని అదృశ్యం

telugu student Nitheesha Kandula missing in usa

Nitheesha Kandula: అమెరికాలో భార‌తీయ విద్యార్ధుల మిస్సింగ్ కేసులు రోజురోజుకీ ఎక్కువ‌వుతున్నాయి. కొంద‌రు మిస్స‌వుతుండ‌గా.. మరికొంద‌రు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజా ఘ‌ట‌న‌లో నితీషా కందుల అనే హైద‌రాబాద్‌కి చెందిన తెలుగు విద్యార్థిని అమెరికాలో క‌నిపించ‌కుండాపోయింది. లాస్ ఏంజెల్స్‌లో నివ‌సిస్తున్న నితీషా దాదాపు వారం రోజుల నుంచి క‌నిపించ‌డంలేద‌ట‌. త‌న స్నేహితులు ప‌లుమార్లు ఫోన్ చేసినా స్పందించ‌లేద‌ని.. ఆమె ఆచూకీ తెలిస్తే తెలియ‌జేయాలంటూ నితీషా సోద‌రి నిఖిత రిక్వెస్ట్ పెట్టారు. ఈ పోస్ట్‌ను భార‌త రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రీట్వీట్ చేసారు.