అమెరికాలో వ్యభిచారం చేయిస్తూ పట్టుబడ్డ తెలుగు యువకులు
USA: అమెరికాలో ఉంటున్న కొందరు తెలుగు యువకులు వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డారు. టెక్సాస్‌లోని డెంటన్‌లో వ్యభిచారం చేస్తూ ఏడుగురు భారతీయులు అరెస్ట్ అయ్యారు అందులో ఐదుగురు తెలుగువారు ఉన్నారు. డెంటన్ కౌంటీ షెరీఫ్ వాళ్లు వ్యభిచారాన్ని అరికట్టడానికి హాయ్‌ల్యాండ్ విలేజ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సహకారంతో నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్లలో మొత్తం 18 మంది పట్టుబడ్డగా అందులో ఏడుగురు భారతీయులు ఉన్నట్లు గుర్తించారు. అరెస్ట్ అయిన వారిలో నిఖిల్ బండి, మోనిష్ గల్లా, నిఖిల్ కుమ్మరి, జైకిరణ్ మేకలా, కార్తీక్ రాయపాటిలను తెలుగు వారిగా గుర్తించారు.