Telangana: TS నుంచి TGకి మారిస్తే నేర‌మే

telangana transport department says it is illegal to change from ts to tg

Telangana: తెలంగాణ‌లోని అన్ని వాహ‌నాల‌ను TS నుంచి TGకి మారిస్తే నేర‌మే అని ప్ర‌క‌టించింది ర‌వాణా శాఖ‌. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక తెలంగాణ‌ను TS అని కాకుండా TG అని రాయాల‌ని వాహ‌నాల రిజిస్ట్రేష‌న్ కూడా TG అనే ఉండాల‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. దాంతో ఎప్పుడో ప‌దేళ్ల క్రితం కొన్న వాహ‌నాల‌కు కూడా కొత్త‌ రిజిస్ట్రేష‌న్ చేస్తున్న‌ట్లు ర‌వాణా శాఖ గుర్తించింది. దాంతో ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కొత్త కోడ్ ప్ర‌క‌టించిన త‌ర్వాత కొన్న‌ వాహ‌నాల‌కు TG అనే నెంబ‌ర్ ప్లేట్‌ను వేయించాల‌ని ఆల్రెడీ ఉన్న‌వాటిని మార్చాల్సిన అవ‌సరం లేద‌ని.. అలా మార్చ‌డం నేరం అని తెలిపింది.