ఆస్ట్రేలియాలో BJP నేత కుమారుడి అనుమానాస్పద మృతి
Telangana: తెలంగాణలోని షాద్ నగర్‌కు చెందిన ఓ యువకుడు ఆస్ట్రేలియాలో అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌కు చెందిన దివంగత భారతీయ జనతా పార్టీ నేత కృష్ణ యాదవ్ కుమారుడు అరవింద్ యాదవ్(30) ఉద్యోగ రీత్యా ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు. అయితే ఐదు రోజుల క్రితం అరవింద్ కనిపించకుండా పోయాడు.
తన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడి ఆచూకీ కోసం గాలింపు చేపడుతుండగా మృతదేహం సముద్రంలో దొరికింది. అరవింద్ భార్య గర్భిణి కావడంతో సోమవారం రోజున కుటుంబ సభ్యులతో స్వదేశానికి వచ్చేందుకు విమాన టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. అయితే ఈ సమయంలో ఇలా జరగడంతో ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో ఆస్ట్రేలియా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.