Telangana Student Dies In Canada: బ‌ర్త్‌డే నాడే మృత్యు ఒడిలోకి

Telangana Student Dies In canada: పుట్టిన‌రోజు నాడే ఓ యువ‌కుడు మృత్యు ఒడిలోకి వెళ్లిపోయిన ఘ‌ట‌న కెన‌డాలో చోటుచేసుకుంది. మృతుడు తెలంగాణ వాసిగా స్థానిక పోలీసు అధికారులు గుర్తించారు. తెలంగాణ‌లోని మీర్‌పేట్‌కి చెందిన ప్రణీత్ అనే యువ‌కుడు కెన‌డాలోని టొరంటోలో మాస్ట‌ర్స్ చేయ‌డానికి వెళ్లాడు. ఆదివారం త‌న పుట్టిన‌రోజు కావ‌డంతో శనివారం ఫ్రెండ్స్‌తో సెల‌బ్రేట్ చేసుకునేందుకు వెళ్లాడు. ఈ క్ర‌మంలో ఓ న‌దిలోకి మోట‌ర్‌బోట్ వేసుకుని దిగారు. అంద‌రూ స‌ర‌దాగా ఫోటోలు, వీడియోలు కూడా తీసుకున్నారు. ఆదివారం అదే నదిలోకి ఈత కొట్టేందుకు ప్రణీత్‌తో పాటు మ‌రో యువ‌కుడు వెళ్లాడు. ఆ యువ‌కుడు తిరిగి వ‌చ్చాడు కానీ ప్ర‌ణీత్ మాత్రం శ‌వంగా తేలాడు. ఈ విష‌యాన్ని మీర్‌పేట్‌లోని త‌ల్లిదండ్రుల‌కు చేర‌వేయ‌డంతో వారి గుండె ప‌గిలింది. త‌మ బిడ్డ మృత‌దేహాన్ని తమకు అప్ప‌గించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కోరారు.