Free Bus Travel: పురుషుల‌కు ప్ర‌త్యేక బ‌స్సులు..!

Free Bus Travel: తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన మ‌హాల‌క్ష్మి ప‌థ‌కం కింద మ‌హిళ‌ల‌కు TSRTC బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం క‌ల్పిస్తున్న సంగ‌తి తెలిసిందే. దీని వ‌ల్ల పాపం మ‌గ‌వారు ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నారు. టికెట్ కొనుక్కుని కూడా వారికి బ‌స్సుల్లో సీట్లు ఉండ‌టం లేదు. మ‌హిళల ర‌ద్దీ ఎక్కువ అయిపోతున్న నేప‌థ్యంలో గమ్యం చేర‌కుండానే బ‌స్సు దిగేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది. దాంతో తెలంగాణ ప్ర‌భుత్వం మ‌గ‌వారి కోసం ప్ర‌త్యేక బ‌స్సులు లాంచ్ చేయ‌నుంది. గ‌తంలో లేడీస్ స్పెష‌ల్ ఉన్న‌ట్లు.. ఇప్పుడు జెంట్స్ స్పెష‌ల్ రాబోతోంద‌న్న‌మాట‌..! అయితే బిజీ రూట్ల‌లో.. కొన్ని స‌మ‌యాల్లో మాత్ర‌మే ఈ జెంట్స్ స్పెష‌ల్ బ‌స్సులు ఉంటాయి. విద్యార్ధుల‌కు కూడా స‌ప‌రేట్‌గా బ‌స్సులు న‌డిపించాల‌న్న యోచ‌న‌లో తెలంగాణ ప్ర‌భుత్వం ఉంది.