Telangana: ఐస్‌క్రీం బండిలో హ‌స్త‌ప్ర‌యోగం.. వీడియో వైర‌ల్

Telangana: తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్ జిల్లాలో ద‌రిద్ర‌మైన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. ఐస్ క్రీం అమ్మే ఓ వ్య‌క్తి హ‌స్త ప్ర‌యోగం చేసుకుని వీర్యాన్ని ఐస్ క్రీం బాక్సులో వేస్తూ సీసీటీవీ కెమెరాలో దొరికిపోయాడు. వ‌రంగ‌ల్‌లోని నెక్కొండ‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వెంట‌నే స్పందించిన పోలీసులు అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు రాజ‌స్థాన్‌కి చెందిన కాలూరాం కుర్బియాగా పోలీసులు గుర్తించారు. నెక్కొండ‌లోని అంబేడ్క‌ర్ సెంట‌ర్‌లో ఈ దృశ్యం సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. దాంతో పోలీసులు వెంట‌నే యాక్ష‌న్ తీసుకున్నారు.