Kumari Aunty: కుమారి ఆంటీ స్టాల్కు వెళ్లనున్న రేవంత్ రెడ్డి..!
Kumari Aunty: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. (revanth reddy) సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయిన కుమారి ఆంటీ స్టాల్కు వెళ్లనున్నారు. ఉన్న చోటనే బిజినెస్ చేసుకోనివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేసారు. మీది మొత్తం రూ.1000 అయ్యింది.. రెండు లివర్లు ఎక్స్ట్రా అనే డైలాగ్తో తెగ ఫేమస్ అయిపోయిన కుమారి ఆంటీని ఇప్పటికే పలు మీడియా వర్గాలు, ఫుడ్ వ్లాగర్స్ ఇబ్బంది పెడుతున్నారు. ఇలాగైతే తన వ్యాపారం దెబ్బ తినే పరిస్థితి వస్తుందని.. దయచేసి మీడియా వారు తనపై ఎక్కువ ఫోకస్ చేయొద్దని ఆమె విన్నవించుకుంటున్నారు.