మైనర్‌పై టీచర్ అత్యాచారం
Teacher: 36 ఏళ్ల టీచర్ ఓ మైనర్ బాలుడిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన అమెరికాలో చోటచేసుకుంది. ఇడాహో హై స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న జెస్సికా అనే మహిళ గతేడాది నవంబర్‌లో ఓ రోజు రాత్రి మైనర్ బాలుడిని తన కారులో ఎక్కించుకుంది. తాను తాగి ఉన్నానని.. కారును నడపలేనని చెప్పడంతో ఆ బాలుడే కారు నడిపాడు. కారు లైట్ ప్రాబ్లం ఉండటంతో పక్కకు ఆపుకోగా పోలీసులు చూసారు. అప్పటికే ఆ బాలుడు గంజాయి సేవించి ఉన్నాడు. పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకుని అతని తల్లిదండ్రులను పిలపించారు. జెస్సికాను అదుపులోకి తీసుకుని విచారించగా.. అప్పటికే బాలుడికి మందు తాగించి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. ఏడాది పాటు ఈ కేసును పోలీసులు విచారించగా.. నిన్న కోర్టు తీర్పు ఇచ్చింది. జెస్సికాకు 20 ఏళ్ల పాటు జైలు శిక్షను విధించింది.