విద్యార్థులను కాపలా పెట్టి.. టీనేజ్ కుర్రాడితో టీచర్ సెక్స్
Viral News: ఓ స్కూల్ టీచర్ నీచమైన చర్యకు పాల్పడింది. 16 ఏళ్ల విద్యార్థితో సంబంధం పెట్టుకుని.. లైంగిక చర్యలు తీసుకుంటూ ఇతర విద్యార్థులను కాపలాగా వాడుకుంది. ఈ ఘటన అమెరికాలోని మిస్సోరీలో చోటుచేసుకుంది. 26 ఏళ్ల హైలీ మిస్సోరీలోని ఓ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తోంది. హైలీ తన విద్యార్థితో జనవరి నుంచి రిలేషన్‌షిప్‌లో ఉంది. ఆ అబ్బాయి మైనర్ అని కూడా చూడకుండా శృంగార చర్యలకు పాల్పడింది. ఆ విద్యార్థి తన వీపుపై ఉన్న గోళ్ల గీతలను మరో విద్యార్థికి ఫోన్‌లో చూపించడంతో విషయం బయటికి వచ్చింది. హైలీ విద్యార్థితో సంబంధం పెట్టుకున్నందుకే ఆమెను భర్త వదిలేసాడని కూడా విచారణలో తేలింది. ప్రస్తుతం హైలీ హౌస్ అరెస్ట్‌లో ఉంది. స్థానిక కోర్టు ఈమెకు నాలుగేళ్ల కారాగార శిక్ష విధించింది. అక్టోబర్ 11 నుంచి హైలీ జైలు శిక్ష అమలు అవుతుంది. అప్పటివరకు ఆమెను హౌస్ అరెస్ట్‌లోనే ఉంచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.