విద్యార్థితో 30 సార్లు శృంగారం..!

teacher had sex with student for 30 times

 

స్కూల్లో, పార్కింగ్‌లో, త‌ర‌గ‌తి గ‌దిలో, వాహ‌నాల్లో ఇలా ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డి విద్యార్థితో ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 30 సార్లు లైంగిక చ‌ర్య‌లో పాల్గొన్న టీచ‌ర్‌ను పోలీసులు ఎట్ట‌కేల‌కు అరెస్ట్ చేసారు. ఈ ఘ‌ట‌న అమెరికాలోని వాషింగ్ట‌న్ డీసీలో చోటుచేసుకుంది. ఆర్కాన్సాస్‌లోని ఓ స్కూల్‌లో టీచ‌ర్‌గా పనిచేస్తున్న 33 ఏళ్ల టీచ‌ర్.. త‌న 17 ఏళ్ల స్టూడెంట్‌తో ఎఫైర్ పెట్టుకుంది. ఆ టీచ‌ర్‌ను కోర్టులో ప్ర‌వేశ‌పెట్ట‌గా న్యాయమూర్తి 20 ఏళ్ల క‌ఠిన కారాగార శిక్ష విధించారు.

కోవిడ్ స‌మ‌యంలో స్కూళ్లు మూత‌బ‌డిన‌ప్పుడు ఈ టీచ‌ర్ అమెరికాకు చెందిన గుడ్ మార్నింగ్ అమెరికా అనే టీవీ షోలో పాల్గొంది. ఈ షో ద్వారా మ‌ళ్లీ కలుద్దాం అంటూ విద్యార్థుల‌కు సందేశం పంపింది. ఈ టీచ‌ర్‌కు ఆల్రెడీ పెళ్లై పిల్ల‌లు కూడా ఉన్నారు. అయినా కూడా విద్యార్థితో అక్ర‌మ సంబంధం పెట్టుకుంది. ఆ టీచ‌ర్ 17 ఏళ్ల విద్యార్థిని మొద‌టిసారి క‌లిసిన‌ప్పుడు ఒక కౌన్సిలింగ్ క్లాస్ తీసుకుంది. ఆ త‌ర్వాత ఏమ‌న్నా సాయం కావాల‌న్నా సందేహాలున్నా త‌న‌కు ఫోన్ చేయాల‌ని త‌న ఫోన్ నెంబ‌ర్ ఇచ్చింద‌ట‌. ఆ త‌ర్వాత వీరిద్ద‌రూ సోష‌ల్ మీడియాలోనూ క‌నెక్ట్ అయ్యారు.

ఓసారి ఆ టీచ‌ర్ విద్యార్థికి ఒక మెసేజ్ పెట్టింది. నువ్వు నేను సెక్స్ చేసుకుంటున్న‌ట్లు నాకు క‌ల వ‌చ్చింది అని. ఆ త‌ర్వాత స్కూల్ విద్యార్థుల‌తో క‌లిసి ఓ ట్రిప్‌కి వెళ్ల‌గా.. అక్క‌డ ఆ విద్యార్థి బ‌స చేస్తున్న హోట‌ల్‌లోనే వారిద్దరూ ప‌లు మార్లు సెక్స్‌లో పాల్గొన్నారు. అలా ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఆ టీచ‌ర్ బాలుడిని లొంగ‌దీసుకునేద‌ని విచార‌ణ‌లో తేలింది.