Viral News: కొన్ని నెల‌ల్లో పెళ్లి.. విద్యార్ధితో దొరికిపోయిన టీచ‌ర్

Teacher Caught Making Out With Student Months Before Wedding

Viral News: కొన్ని నెల‌ల్లో పెళ్లి జ‌ర‌గాల్సి ఉండ‌గా.. విద్యార్ధితో టీచ‌ర్ అక్రమ సంబంధం పెట్టుకున్న ఘ‌ట‌న తాజాగా అమెరికాలోని హ‌డ్స‌న్ ప్రాంతంలో వెలుగుచూసింది. ఇది వ‌రుస‌గా 11వ ఘ‌ట‌న కావ‌డం గ‌మ‌నార్హం. 24 ఏళ్ల మ్యాడిస‌న్ అనే యువ‌తికి ఇంకొన్ని నెల‌ల్లో పెళ్లి జ‌ర‌గాల్సి ఉంది. మ్యాడిస‌న్ హ‌డ్స‌న్‌లోని రివ‌ర్ క్రెస్ట్ ఎలిమెంట‌రీ స్కూల్‌లో టీచ‌ర్‌గా పనిచేస్తోంది. ఈ నేప‌థ్యంలో కొన్ని నెల‌ల క్రితం మ్యాడిస‌న్‌తో పాటు విద్యార్ధులు త‌మ త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి వింట‌ర్ బ్రేక్‌లో భాగంగా వెకేష‌న్‌కు వెళ్లారు.

ఆ స‌మ‌యంలో 11 ఏళ్ల విద్యార్ధి త‌న నెంబ‌ర్‌ను మ్యాడిస‌న్‌కు ఇచ్చాడు. వెకేష‌న్‌లో భాగంగా అంద‌రూ సుర‌క్షితంగా ఉండేలా ఎవ‌రూ త‌ప్పిపోకూడ‌దు అన్న ఉద్దేశంతో విద్యార్ధుల నుంచి మ్యాడిస‌న్ నెంబ‌ర్లు తీసుకుంది. అయితే ఈ 11 ఏళ్ల విద్యార్ధితో మాత్రం మ్యాడిసన్ అక్ర‌మ సంబంధం పెట్టుకుంది. ఓసారి ఆ విద్యార్ధికి వ‌చ్చిన మెసేజ్‌ను అత‌ని త‌ల్లి చూడటంతో వీరి బండారం బ‌య‌ట‌ప‌డింది. వెంట‌నే విద్యార్ధిని స్కూల్‌కి తీసుకెళ్లి ప్ర‌న్సిప‌ల్‌కు జ‌రిగిన విష‌యం చెప్ప‌గా.. మ్యాడిస‌న్ కంప్యూట‌ర్‌ను త‌నిఖీ చేసారు. అందులో ఆ విద్యార్ధి పేరుతో ఓ ఫోల్డ‌ర్ ల‌భించింది. అందులో వారిద్ద‌రూ ఒక‌రికొక‌రు రాసుకున్న ల‌వ్ లెట‌ర్లు ఉండ‌టం చూసి వారు షాక‌య్యారు. దాంతో వెంట‌నే పోలీసుల‌ను పిలిపించి మ్యాడిస‌న్‌ను అరెస్ట్ చేయించారు. ఆ విద్యార్ధిని కౌన్సిలింగ్‌కు పంపించారు.