TCS: రాజీనామాలు చేస్తున్న మ‌హిళా ఉద్యోగులు

Hyderabad: అతిపెద్ద టెక్ కంపెనీల్లో ఒక‌టైన‌ టాటా క‌న్‌స‌ల్టెన్సీ స‌ర్వీసెస్‌లో (tcs) చాలా మంది మ‌హిళా ఉద్యోగులు రాజీనామాలు చేస్తున్నారు. ఇందుకు కార‌ణం TCS వ‌ర్క్ ఫ్రం హోం పాల‌సీని తొల‌గించ‌డ‌మేన‌ట‌. దాంతో స్వ‌స్థ‌లాల‌కు వెళ్లిపోయిన మ‌హిళ‌లు, పెళ్లై పిల్ల‌లు ఉన్న‌వారు ఇక చేసేదేమీ లేక రిజైన్ చేసేస్తున్నార‌ట‌. TCSలో 35% మ‌హిళ‌లా ఉద్యోగులే ఉన్నార‌ని, కానీ వ‌ర్క్ ఫ్రం హోం తీసేయ‌డం వ‌ల్ల వారి సంఖ్య చాలా మ‌టుకు త‌గ్గిపోయింద‌ని చీఫ్‌ హ్యూమ‌ర్ రిసోర్స్ డైరెక్ట‌ర్ మిలింద్ ల‌ఖియా తెలిపారు. జెండ‌ర్ డైవ‌ర్సిటీ కోసం కృషి చేసే టీసీఎస్‌లో ఇలా మ‌హిళా ఉద్యోగులు రాజీనామాలు చేయ‌డం కంపెనీకి కాస్త న‌ష్టం క‌లిగించే అంశ‌మేనని అన్నారు.

మ‌హిళ‌ల కోస‌మైనా వ‌ర్క్ ఫ్రం హోం పాల‌సీని తీసుకురావాల‌ని టీసీఎస్ ఆలోచిస్తున్న‌ట్లు తెలిపారు. 2023 ఆర్ధిక సంవత్స‌రానికి గానూ టీసీఎస్ ఎంపిక‌చేసిన మ‌హిళా ఉద్యోగుల సంఖ్య 38% ఉంద‌ని పేర్కొన్నారు. ఇప్పుడున్న 30,000 మంది సీనియ‌ర్ ఉద్యోగుల్లో 4000 మంది మ‌హిళ‌లే ఉన్నారు. ఇటీవ‌ల TCS రీ బిగిన్ (re-begin) అనే ఓ ప్రోగ్రామ్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. దీని ద్వారా బ్రేక్ తీసుకుని మ‌ళ్లీ ఉద్యోగం చేయాల‌నుకుంటున్న మ‌హిళ‌ల‌కు ఇదొక గొప్ప అవ‌కాశం. 2023లోనే దాదాపు 14,000 మంది మహిళ‌ల నుంచి అప్లికేష‌న్లు వ‌చ్చిన‌ట్లు సంస్థ తెలిపింది.