TCS: గుడ్‌న్యూస్.. ఉద్యోగులకు డబుల్ సాలరీ..!
Hyderabad: టీసీఎస్(tcs) ఉద్యోగులకు గుడ్‌న్యూస్. త్వరలో టీసీఎస్(tata consultancy services) ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. జీతాల్లో(salaries) అసమానతలు ఉండకూడదని సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రిసెషన్ సమయంలో ఎలాంటి లేఆఫ్‌లకు పాల్పడకుండా ఉద్యోగులకు జాబ్ సెక్యూరిటీ కల్పించిన మొట్టమొదటి సంస్థ టీసీఎస్. ఇప్పుడు ఉద్యోగుల జీతాలు పెంచి వారిని మరింత ఎంకరేజ్ చేయాలని అనుకుంటున్నట్లు టీసీఎస్ చీఫ్ హెచ్ ఆర్ మిలింద్ లక్కడ్ తెలిపారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే..ఉద్యోగులు అందరికీ అమాంతం జీతాలు పెంచేస్తారు అని కాదు. ఉద్యోగులు తమ నైపుణ్యాలను మరింత పెంచుకుని తమని తాము బెటర్‌గా మార్చుకునేవారికే ఈ అవకాశం. అంటే.. ఫ్రెషర్స్‌కి ఎక్కువ జీతాలు ఇచ్చే బదులు ఆల్రెడీ పనిచేస్తున్నవారికే మరోసారి ఇంటర్వ్యూలు పెడుతుంది. ఇందుకోసం ఇన్‌హౌజ్ ప్రోగ్రామ్స్ ప్రారంభించనుంది. దీని నుంచి ఉద్యోగులు కోర్సులు తీసుకుని తమ నైపుణ్యాలు పెంచుకోగలగాలి. కోర్సులు పూర్తయ్యాక అసెస్‌మెంట్లు కండక్ట్ చేస్తారు. అందులో మంచి పర్సెంటేజ్ వస్తే ఆటోమేటిక్‌గా జీతం రెట్టింపు అవుతుంది. ఈ ప్రోగ్రామ్‌కు ఇప్పటికే 4 లక్షల మంది ఉద్యోగులు రిజిస్టర్ చేసుకున్నారు. ఇప్పటికే ప్రతి సంవత్సరం దాదాపు 10% మంది ఉద్యోగులు అసెస్‌మెంట్ రాసి మంచి పర్సెంటేజ్‌తో డబుల్ సాలరీలు తీసుకుంటున్నట్లు తెలిపింది.