Food Safety: ఆ రాష్ట్రమే నెంబర్ వన్
Food Safety: ఈ మధ్యకాలంలో ఒక్కో హోటల్, రెస్టారెంట్లలో బయటపడిన దరిద్రాలు చూసాం.. చూస్తూనే ఉన్నాం కూడా. పెద్ద పెద్ద హోటల్స్‌లోనే ఎక్స్‌పైర్ అయిపోయిన నాసిరకం ఉత్పత్తులు వాడటం… మురికి నీటితో ప్లేట్లను శుభ్రం చేయడం వంటి దృశ్యాలు బయటపడ్డాయి. దాంతో బయట తినాలన్నా ఒకటికి వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి.
ఈ నేపథ్యంలో స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ (SFSI) చేపట్టిన సర్వేలో రెండు రాష్ట్రాల్లో మాత్రమే సేఫ్టీ స్టాండర్డ్‌లు పాటిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ విషయంలో తమిళనాడు నెంబర్ 1 స్థానంలో ఉండగా.. నెంబర్ 2 స్థానంలో కేరళ ఉంది. తమిళనాడు గతేడాది రెండో స్థానంలో ఉండగా.. ఈ ఏడాది టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్, గుజరాత్, నాగాల్యాండ్ రాష్ట్రాలు ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాలు టాప్ 5లో లేకపోవడం దురదృష్టకరం.
తమిళనాడు, కేరళ టాప్‌లో ఉండటానికి కారణం చాలా చోట్ల ఫుడ్ సేఫ్టీ ఇన్‌స్పెక్షన్లు రెగ్యులర్‌గా జరుగుతుంటాయి. ఎప్పటికప్పుడు ఫుడ్ టెస్ట్ చేసేందుకు ల్యాబ్ టెస్టింగ్ జరుగుతుంటుంది. ఎప్పటికప్పుడు సాంపుల్ కలెక్షన్స్ చేస్తుంటారు. ఎక్కడైనా తేడా జరిగితే లీగల్ యాక్షన్లు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. అవసరమైనప్పుడల్లా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏర్పాటుచేస్తుంటారు.