డ్రైవర్ ఖాతాలో 9000 కోట్లు.. బ్యాంక్ CEO రాజీనామా
ఇటీవల తమిళనాడుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ బ్యాంక్ (bank) ఖాతాలో రూ.9000 కోట్లు క్రెడిట్ అయిన వార్త సంచలనం సృష్టించింది. ఈ పొరపాటు తమిళనాడుకు చెందిన ప్రముఖ తమిళనాడు మెర్సంటైల్ బ్యాంక్‌లో జరిగింది. సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగిందని వెంటనే ఆ డబ్బుని తిరిగి క్రెడిట్ చేసుకున్నామని బ్యాంక్ వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో బ్యాంక్ CEO కృష్ణన్ రాజీనామా చేసారు. అయితే ఈ ఘటన జరిగిన వారం రోజుల్లోనే ఆయన రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇంకా తన పదవీ కాలం ఉన్నప్పటికీ.. వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఎప్పుడైతే ఆటో డ్రైవర్ ఖాతాలో రూ.9000 కోట్లు పొరపాటున క్రెడిట్ అయ్యాయో.. ఆ తర్వాత పలువురు కృష్ణన్ తప్పిదం వల్లే జరిగిందని ఆరోపించారని.. అది అవమానంగా భావించి ఆయన రాజీనామా చేసారని మరికొందరి వాదన. ఈ బ్యాంక్‌లో తమిళనాడుకు చెందిన ఎందరో ప్రముఖుల ఖాతాలు కూడా ఉన్నాయి. ఈ ఏడాది జూన్‌లో ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టగా బ్యాంక్ ఖాతాలు, లావాదేవీల్లో లోపాలు ఉన్నాయని గుర్తించింది. (tamilnadu mercentile bank)