Organ Donor చనిపోతే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
అవయవదాతలు (organ donor) చనిపోతే వారికి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తమిళనాడు (tamilnadu) ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (mk stalin) ఆదేశాలు జారీ చేసారు. అవయవదానాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం యావత్ భారతదేశంలో తమిళనాడు మాత్రమేనని స్టాలిన్ తెలిపారు. చనిపోయిన తర్వాత కూడా మరొకరికి జీవం పోయాలని అవయవదానం చేసేవారికి నివాళులు అర్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.