Divorce: నటి విడాకుల ఫొటోషూట్
Hyderabad: తమిళ నటి షాలిని(shalini) విడాకుల ఫొటోషూట్(divorce photoshoot)తో ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచారు. పలు తమిళ సీరియల్స్‌లో నటించిన షాలిని(shalini) 2020 జులైలో రియాజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే కొన్ని నెలల క్రితం రియాజ్ మెంటల్ టార్చర్ చేస్తున్నాడని, చాలాసార్లు కొట్టాడని పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఆ తర్వాత విడాకులకు అప్లై చేసింది. మొత్తానికి కోర్టు త్వరగా కేసు తేల్చడంతో షాలినికి తన భర్త నుంచి విముక్తి లభించింది. అయితే నలుగురినీ పిలిచి పెళ్లి వేడుకను ఎంత సంతోషంగా జరుపుకుంటామో విడాకులను కూడా అంతే సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని డైవర్స్ ఫొటోషూట్ చేసింది షాలిని. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. నాకు 99 సమస్యలు ఉన్నాయి కానీ అందులో భర్త మాత్రం లేడు. అని క్యాప్షన్ ఇచ్చింది. అయితే కొన్ని నెలల క్రితం ఓ విదేశీ మహిళ తన భర్తతో విడిపోయినందుకు సంతోషిస్తూ విడాకులను ఫొటోషూట్‌తో సెలబ్రేట్ చేసుకుంది. ఆమె ఫొటోలు వైరల్ అయ్యాక షాలిని ఆమెను కాపీ కొట్టిందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేసారు. అయితే షాలిని మాత్రం ఈ విషయం గురించి మీడియాతో ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వదలచుకోలేదని, విడాకులతో మహిళ జీవితం అంతం అయిపోయినట్లు కాదు అని చెప్పడానికే ఈ ఫొటోలు ఇన్‌స్టాలో పెట్టానని తెలిపింది.