Swiggy: ఇక స్విగ్గీ, జొమాటోల ద్వారా లిక్క‌ర్ డెలివ‌రీలు

Swiggy zomato to deliver liquor soon

Swiggy: ప్ర‌ముఖ ఫుడ్ డెలివ‌రీ యాప్స్ అయిన స్విగ్గీ, జొమాటోల ద్వారా త్వ‌ర‌లో లిక్క‌ర్ కూడా డెలివ‌ర్ కానుంది. ఇప్ప‌టివ‌ర‌కు స‌రుకులు, కాయ‌గూర‌లు, ఆహార ప‌దార్థాలు డెలివ‌ర్ చేస్తున్న ఈ సంస్థ త్వ‌ర‌లో త‌క్కువ ఆల్క‌హాల్ ఉన్న మ‌ద్యాన్ని డెలివ‌ర్ చేయ‌బోతున్నాయి. న్యూఢిల్లీ, క‌ర్ణాట‌క‌, హ‌ర్యాణా, పంజాబ్, త‌మిళ‌నాడు, గోవా, కేర‌ళ‌లో ఈ మ‌ద్యం డెలివ‌రీ ప్రాజెక్ట్‌ను మొద‌లుపెట్ట‌నున్నారు. ప్ర‌స్తుతానికి వెస్ట్ బెంగాల్, ఒడిశాల‌లో ఆల్రెడీ మ‌ద్యం డెలివ‌రీల‌ను మొద‌లుపెట్టేసారు.

ఈ మ‌ధ్య‌కాలంలో పురుషులు, మ‌హిళ‌లు, సీనియ‌ర్ సిటిజ‌న్లు త‌క్కువ మోతాదులో మ‌ద్యం కొనుగోలు చేసేందుకు మ‌ద్యం షాపుల‌కు వెళ్లాల్సి వ‌స్తోంద‌ని.. కొన్ని సార్లు అది అసౌక‌ర్యానికి గురిచేస్తోంద‌ని ఓ స‌ర్వేలో తేలింద‌ట‌. దాంతో ఇక షాపుల‌కు వెళ్ల‌కుండా నేరుగా ఆర్డ‌ర్ పెట్ట‌గానే మ‌ద్యం ఇంటికి తీసుకొచ్చే ఏర్పాట్ల‌ను చేయాల‌ని జొమాటో, స్విగ్గీ స‌న్నాహాలు చేస్తున్నాయి. అయితే మ‌ద్యం డెలివ‌రీకి కావాల్సిన అన్ని ర‌కాల ప‌ర్మిష‌న్లు తీసుకున్నాకే ఇది అందుబాటులోకి వ‌స్తుంద‌ని అంటున్నారు.