Swiggy: స్విగ్గీ గిన్నీస్ రికార్డు

swiggy guinness record

Swiggy: ప్ర‌ముఖ ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డ‌రింగ్ కంపెనీ స్విగ్గీ గిన్నీస్ రికార్డుకెక్కింది. ఒక్క రోజులో 11 వేల వ‌డాపావ్‌లు డెలివ‌రీ చేసినందుకు ఈ రికార్డు నెల‌కొల్పారు. అయితే ఈ ఆర్డ‌ర్‌ను సాధార‌ణ క‌స్ట‌మ‌ర్ పెట్ట‌లేదు. రాబిన్ హుడ్ ఆర్మీ అనే ఎన్జీవో ఆహారం లేని పిల్ల‌ల కోసం ఒక్క రోజులో 11 వేల వ‌డాపావ్‌లు ఆర్డ‌ర్ పెట్టి వారి క‌డుపు నింపింది. ఈ వ‌డాపావ్‌ల‌ను ముంబైకి చెందిన MM మిఠాయివాలా స‌ర‌ఫ‌రా చేసారు. త‌క్కువ స‌మ‌యంలో 11 వేల వ‌డాపావ్‌లు త‌యారుచేయించినందుకు స్విగ్గీ మిఠాయివాలా య‌జ‌మానికి కూడా ధ‌న్య‌వాదాలు తెలిపింది. XL ఫ్లీట్ పేరుతో స్విగ్గీ ఎల‌క్ట్రిక్ వాహ‌నాల ద్వారా భారీ డెలివ‌రీలు మొద‌లుపెట్టింది. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ న‌టులు అజయ్ దేవ‌గ‌ణ్‌, ద‌ర్శ‌కుడు రోహిత్ శెట్టిలు ఈ XL ఫ్లీట్‌లో భాగ‌స్వామ్యం అయ్యారు.