చేసేది స్వీప‌ర్ ప‌ని.. ల‌గ్జ‌రీ కార్ల‌కు య‌జ‌మాని..!

sweeper owns a bungalow and cars

 

Viral News: చేసేదేమో స్వీప‌ర్ ప‌ని.. కానీ ఓ భారీ భ‌వ‌నానికి, ల‌గ్జ‌రీ కార్ల‌కు య‌జ‌మాని. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. గోండా జిల్లాకు చెందిన సంతోష్ కుమార్ జైస్వాల్ అనే వ్య‌క్తి స్థానిక ప్ర‌భుత్వ ఆఫీస్‌లో క్లెర్క్‌గా ప‌నిచేసేవాడు. ఆ స‌మ‌యంలో త‌న తెలివి తేట‌ల‌ను వాడి వివిధ ఫైల్స్‌ను సేక‌రించి ఫోర్జ‌రీల‌కు పాల్ప‌డ్డాడు.ఈ నేప‌థ్యంలో చాలా మ‌టుకు ఆస్తుల‌ను త‌న‌పై ట్రాన్స్‌ఫ‌ర్ చేయించుకున్నాడు. అలా కోట్లు విలువైన ల‌గ్జ‌రీ కార్లు, పెద్ద భ‌వ‌నానికి య‌జ‌మాని అయ్యాడు. క‌మిష‌న‌ర్ ఆఫీస్‌కి ఓ కంప్లైంట్ రావ‌డంతో క‌మిష‌న‌ర్ యోగేశ్వ‌ర్ రామ్ విచార‌ణ ప్రారంభించారు. అలా సంతోష్ కుమార్ ప‌ట్టుబ‌డిపోయాడు. అత‌న్ని విధుల నుంచి స‌స్పెండ్ చేసి జైలుకు పంపించారు.