Surya Kumar: విరాట్ ర‌న్నింగ్‌ని ట్రోల్ చేసిన సూర్య‌

క్రికెట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ (surya kumar yadav)..టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (virat kohli) ర‌న్నింగ్ టెక్నిక్‌పై కామెంట్ చేసాడు. విరాట్.. త‌న భార్య అనుష్క శ‌ర్మ‌తో (anushka sharma) క‌లిసి ప్యూమా ఇండియా యాడ్‌లో న‌టించాడు. యాడ్ షూట్‌లో భాగంగా కోహ్లీ అనుష్క క‌లిసి ప‌రిగెత్తిన ఫొటో స్టిల్స్‌ని అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీనిపై సూర్య కామెంట్ చేస్తూ.. భాయ్ మీ రన్నింగ్ టెక్నిక్ కాస్త గాడిత‌ప్పిన‌ట్లుంది అని రాసాడు. దాంతో ఈ కామెంట్ తెగ వైర‌ల్ అవుతోంది.