Supreme Court: మా తీర్పులకు లెక్కలేదా?
భారత సర్వోన్నత న్యాయస్థానం (supreme court).. గుజరాత్ హైకోర్టుకు (gujarat high court) చివాట్లు పెట్టింది. తమ తీర్పును లెక్క చేయడంలేదని మండిపడింది. ఒక్కసారి సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించాక దానిని మార్చడం, వ్యతిరేకంగా తీర్పు ఇచ్చే హక్కు ఏ న్యాయస్థానికి లేదని స్పష్టం చేసింది.
మ్యాటర్ ఇది..!
అత్యాచారానికి గురైన ఓ యువతి గర్భం దాల్చడంతో ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ చేయించుకునేందుకు పర్మిషన్ కోసం గుజరాత్ హైకోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఇది సెన్సిటివ్ మ్యాటర్ అని తెలిసి కూడా గుజరాత్ హైకోర్టు వెంటనే పరిశీలించకపోగా.. మెడికల్ రిపోర్ట్ వచ్చిన 11 రోజుల తర్వాత కేసును టేకప్ చేసింది. వాదోపవాదాలు విన్నాక టెర్మినేషన్‌కు అనుమతించలేమని తీర్పు చెప్పింది.
ఏం చేయాలో తెలీక ఆ యువతి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు జడ్జిలు కేసును పరిశీలించేలోపే.. గుజరాత్ హైకోర్టు టెర్మినేషన్‌ను అనుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది. దాంతో సుప్రీంకోర్టుకు ఒళ్లు మండింది. రేప్ కేసుల్లో బాధితులు కావాలనుకుంటనే ప్రెగ్నెన్సీని టర్మినేట్ చేసుకోవచ్చనే సుప్రీంకోర్టు తీర్పును గుజరాత్ హైకోర్టు కొట్టివేయడం భావ్యం కాదని.. అది రాజ్యాంగ పరంగా నేరమని తెలిపింది. (supreme court)
వెంటనే తీర్పులు వెల్లడించాల్సిన ఇలాంటి కేసుల్లో గుజరాత్ హైకోర్టు ఆలస్యం చేయడంపై కూడా సుప్రీంకోర్టు మండిపడింది. ఈ నేపథ్యంలో గుజరాత్ హైకోర్టులో ప్రభుత్వం తరఫున తన వాదనలు వినిపించిన లాయర్.. అంతకుముందు ఇచ్చిన తీర్పులో చిన్న లోపం ఉందని దానిని సవరించాలనుకున్నామని వివరణ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ.. బాధిత యువతికి మళ్లీ పరీక్షలు చేసి బిడ్డను టెర్మినేట్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. బిడ్డ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఇన్‌క్యుబేషన్‌లో ఉంచాలని.. ఆ తర్వాత బిడ్డను అనాథాశ్రమాలకు ఇచ్చే ఉద్దేశం ఉంటే ఇవ్వచ్చని తెలిపింది.