LGBTQ: స్వలింగ సంపర్క వివాహానికి పార్లమెంట్ ఒప్పుకుంటుందా?
Supreme court says no to lgbtq marriage: వాదోపవాదాలు విన్నాక సుప్రీంకోర్టు (supreme court) ఈరోజు స్వలింగ సంపర్క (lgbtq) సంబంధాలపై తీర్పు వెల్లడించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో పాటు మరో నలుగురు న్యాయమూర్తులు ఈ అంశంపై నాలుగు రకాల భిన్నమైన తీర్పులు వెల్లడించారు. అయితే అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం మాత్రం.. స్వలింగ సంపర్క వివాహాల విషయంలో కలగజేసుకోలేమని చెప్పడం. వివాహ వ్యవస్థ అనేది పార్లమెంట్ నిర్ణయించించిన అంశం. ఇప్పుడు స్వలింగ సంపర్కులు పెళ్లి చేసుకోవాలా వద్దా అనేది పార్లమెంటే నిర్ణయించాలని అన్నారు. కాకపోతే.. స్వలింగ సంపర్కులకు కూడా ఈ దేశంలో స్వేచ్ఛగా బతికే హక్కు ఉందని మాత్రం వెల్లడించారు. (same sex marriage)