Supreme Court: రేప్ చేసి చంపేసాడు.. యావ‌జ్జీవ శిక్ష‌ అవ‌స‌ర‌మా?

స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం (supreme court) తీసుకున్న నిర్ణ‌యం చ‌ర్చనీయాంశంగా మారింది. ఓ వ్య‌క్తి బాలిక‌ను రేప్ చేసి చంపేస్తే.. అత‌నికి పాట్నా హైకోర్టు (patna high court) యావ‌జ్జీవ కారాగార శిక్ష‌ విధించింది. ఈ కేసును సుప్రీంకోర్టుకు తీసుకెళ్ల‌గా.. జ‌డ్జి రోబోలా అంత క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాలా..? అత‌నికి యావ‌జ్జీవ కారాగార శిక్ష‌ తీసేసే విధంగా ఏదైనా ఆలోచించాల‌ని పాట్నా హైకోర్టును రిక్వెస్ట్ చేసింది. 2015లో బిహార్‌లోని పాట్నాకు చెందిన ఓ బాలిక‌.. టీవీ చూసేందుకు పక్కింటికి వెళ్లింది. ఆ ఇంట్లోని వ్య‌క్తి బాలిక‌ను దారుణంగా రేప్ చేసి చంపేసాడు. ఈ కేసులో వాదోప‌వాదాలు విన్న పాట్నా హైకోర్టు.. అత‌నికి యావ‌జ్జీవ కారాగార శిక్ష‌ విధించింది.

దాంతో అత‌ను నిందితుడు సుప్రీంకోర్టులో  (supreme court) పిటిషన్ వేయించుకున్నాడు. ఈ కేసును బాగా ప‌రిశీలించిన కోర్టు.. ఇందులో అంత సీరియ‌స్ విష‌యాలు ఏమీ లేవ‌ని.. జ‌డ్జి క‌ళ్లుమూసుకుని రోబోలా వ్య‌వ‌హ‌రించ‌కూడ‌ద‌ని పాట్నా హైకోర్టుకి తెలిపింది. ఈ కేసులో నిందితుడికి యావ‌జ్జీవ కారాగార శిక్ష‌ అవ‌స‌రం లేద‌ని ఇంకోసారి కేసును ప‌రిశీలించాల‌ని కోరింది. ఈ కేసులో ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి ఫోరెన్సిక్ రిపోర్టులు కూడా కోర్టుకు స‌బ్మిట్ చేయ‌లేద‌ని కేసులో చాలా లోపాలు ఉన్నాయ‌ని సుప్రీంకోర్టు జ‌డ్జిలు తెలిపారు.

అంతేకాదు.. బాధితురాలికి ఎలాంటి వైద్య ప‌రీక్షలు కూడా చేయించలేదట‌. బాధితురాలు 2015లో ఇచ్చిన వాంగ్మూలం ప్ర‌కారం.. నిందితుడితో పాటు మ‌రో వ్య‌క్తి కూడా ఉన్న‌ట్లు చెప్పింద‌ని కానీ ఆ రెండో వ్య‌క్తిని మాత్రం స‌రిగ్గా విచారించ‌లేద‌ని పాట్నా హైకోర్టుపై సుప్రీంకోర్టు మండిప‌డింది. “” ఇప్ప‌టికే నిందితుడు తొమ్మిదేళ్లు శిక్ష అనుభ‌వించాడు. న్యాయ‌స్థానం గుడ్డిగా ఎవ‌రు ఏది చెప్తే అది నమ్మి శిక్ష‌లు విధించ‌కూడ‌దు. నిజానిజాలు తెలుసుకోవాలి. అమాయ‌కుల‌ను శిక్ష ప‌డ‌కూడ‌దు.. నిందితులు త‌ప్పించుకోకూడ‌దు అనే ది మ‌న న్యాయ‌విధానం. కాబ‌ట్టి ఇంకోసారి ఈ కేసును బాగా ప‌రిశీలించి తీర్పు వెల్ల‌డించాల‌ని కోరుతున్నాం “” అని సుప్రీంకోర్టును తెలిపింది. (supreme court)