Supreme Court: కేసు వివరాలు నాకు తెలీదు యువర్ ఆనర్
భారతదేశ సర్వోన్నత న్యాయస్థానంలో (supreme court) ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఓ కేసు విషయమై కోర్టులో వాదనలు వినిపించేందుకు ఓ సీనియర్ అడ్వకేట్ తన జూనియర్‌ను పంపాడు. అదే అతను చేసిన పెద్ద తప్పు. వివరాల్లోకెళితే.. ఓ సీనియర్ అడ్వకేట్ ఓ కేసుని వాయిదా వేసే విషయమై వాదనలు వినిపించాల్సి ఉంది. అయితే ఆ అడ్వకేట్ ఏదో పని ఉండటం వల్ల తన బదులు తన దగ్గర పనిచేస్తున్న జూనియర్ లాయర్‌ను పంపించాడు.
కోర్టు వాదనలు మొదలయ్యేముందు ఆ జూనియర్ లాయర్ తనని తాను పరిచయం చేసుకుంటూ.. మా సీనియర్ వేరే పని మీద రాలేకపోయారు. అందుకే నన్ను పంపారు అని చెప్పాడు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ స్పందిస్తూ.. ఇలా కోర్టు నిబంధనలను ఇష్టారాజ్యంగా వాడుకోకూడదు అని హెచ్చరించి ప్రొసీడ్ అవ్వాలని ఆదేశించారు. అయితే ఆ జూనియర్ లాయర్‌కి అసలు కేసు వివరాలేవీ తెలీకపోవడంతో ఏం మాట్లాడాలో తెలీక నాకు వివరాలు తెలీవు యువర్ ఆనర్ అని బిత్తర ముఖం వేసాడు. దాంతో జడ్జ్‌కి కోపం తన్నుకొచ్చింది. వెంటనే ఆ సీనియర్ అడ్వకేట్‌ను ఫోన్ కాల్ ద్వారా సంప్రదించారు. ఇలా కేసు వివరాలు ఏమీ తెలీని లాయర్‌ను ఎలా కోర్టుకు పంపిస్తారు అని చీవాట్లు పెట్టారు. కోర్టు సమయం వృధా చేసినందుకు గానూ రూ.2000 జరిమానా విధించారు. (supreme court)