Kolkata Rape Case: ఓ లాయరూ.. కొంచం తగ్గు
Supreme Court: ఈరోజు సుప్రీంకోర్టలో దేశాన్ని కుదిపేసిన కలకత్తా అత్యాచార కేసు విచారణకు వచ్చింది. సీబీఐ తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబాల్ వాదించాల్సి ఉంది. కలకత్తా ఘటన గురించి కపిల్ వివరిస్తూ.. కౌస్తవ్ భాగ్చి అనే న్యాయవాది ఆర్జీ కర్ హాస్పిటల్ ధర్నాలో పాల్గొని రాళ్లు రువ్వారని అన్నారు. కౌస్తవ్ గతంలో కాంగ్రెస్లో ఉన్నారు. ఇటీవల ఆయన భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ నేపథ్యంలో కపిల్ సిబాల్ తన వాదనలు వినిపిస్తూ ఆర్జీ కర్ హాస్పిటల్ బయట కౌస్తవ్ కూడా రాళ్లు రువ్వుతూ కనిపించారని.. దీనిని నిరూపించేందుకు తన దగ్గర ఫోటోలు, వీడియోలు ఉన్నాయని అన్నారు. కపిల్ సిబాల్ నిదానంగా మాట్లాడుతుంటే.. కౌస్తవ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఉండగానే రెచ్చిపోతూ తన తరఫు వాదనలు వినిపించారు.
కపిల్ సిబాల్ని పట్టుకుని మీలాంటి సీనియర్లు ఇలాంటి కామెంట్స్ చేయచ్చా అని కౌస్తవ్ అరిచాడు. అప్పటివరకు కౌస్తవ్ ప్రవర్తనను గమనిస్తున్న చంద్రచూడ్ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసారు. నువ్వొక అడ్వకేట్వి. కాస్త తగ్గు. నెమ్మదిగా మాట్లాడు. నువ్వు ముగ్గురు జడ్జిల ముందు వాదిస్తున్నావా లేక బయట మీడియా ముందు మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా అని మొటిక్కాయలు వేసారు. దాంతో కౌస్తవ్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.