Waayu: కొత్త ఫుడ్ యాప్.. స్విగ్గీ, జొమాటో కన్నా చీప్!
Hyderabad: ఇప్పటికే ఫుడ్ డెలివరీ మార్కెట్‌లో టాప్ సంస్థలుగా నిలిచిన స్విగ్గీ(swiggy), జొమాటో(zomato)కి పోటీగా మరో యాప్ రాబోతోంది. అదే వాయు(waayu). ముంబైకి చెందిన అనిరుధా కోట్గిరే, మందార్ లాండే అనే ఇద్దరు టెక్ వ్యాపారులు డెస్కెట్ హొరేకా సంస్థ ద్వారా ఈ వాయు యాప్‌ను లాంచ్ చేసారు. ముంబైలోని దాదాపు అన్ని రెస్టారెంట్లు, హోటళ్లకు ఈ యాప్ యాక్సెస్ ఉంది. ఈ యాప్ ప్రారంభించడానికి వెనక ఉన్న ప్రధాన కారణం ఎక్కువ కమిషన్లు, తప్పుడు రివ్యూలు, తక్కువ క్వాలిటీ ఫుడ్. ఇవన్నీ లేకుండా ముంబై ప్రజలకు తక్కువ ధరకే చక్కటి ఫుడ్ అందించాలన్నది వాయు లక్ష్యం. స్విగ్గీ, జొమాటో ధరలతో పోలిస్తే 20% తగ్గింపుతో ఫుడ్ డెలివరీ చేస్తోంది. ఈ వాయు ఫుడ్ యాప్‌కు బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ముంబైలోని 1000కి పైగా రెస్టారెంట్లలో ఈ యాప్ వాడులో ఉంది. త్వరలో ప్రభుత్వానికి చెందిన ONDC ప్లాట్‌ఫాంతో ఇంటిగ్రేట్ అయ్యి ఇతర టాప్ నగరాల్లోనూ తమ సేవలను అందించనున్నట్లు వాయు యాజమాన్యం తెలిపింది.