Sukesh Chandrashekhar: నా బుట్ట బొమ్మ.. నిన్ను త్వరలో హగ్ చేసుకుంటాను
Sukesh Chandrashekhar: రూ.200 కోట్ల దోపిడీ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుఖేష్ చంద్రశేఖర్.. మళ్లీ జైలు నుంచి తన మాజీ ప్రేయసి, నటి జాక్వెలీన్ ఫెర్నాండెజ్‌కు (jacqueline fernandez) లవ్ లెటర్ రాసాడు. క్రిస్మస్, థ్యాంక్స్ గివింగ్ పండుగలు వస్తున్న నేపథ్యంలో జాక్వెలీన్‌కు లేఖ రాసి కానుకలు కూడా పంపాడు. ఆ లేఖలో జాక్వెలీన్‌ను త్వరలో కలుస్తానని.. అప్పుడు కలిసి సంబరాలు చేసుకుందామని పేర్కొన్నాడు.
లేఖలో ఏం రాసాడంటే..
“” మై డియర్ జాక్వెలీన్.. ముందుగా DIAFA అవార్డు సొంతం చేసుకున్నందుకు శుభాకాంక్షలు. భారత చలన చిత్ర పరిశ్రమ నీలాంటి నటి ఉన్నందుకు పుణ్యం చేసుకుంది. వేడుకలో నువ్వు వేసుకున్న తెల్ల గౌనులో ఎంతో అందంగా ఉన్నావ్. ఈ ప్రపంచంలోనే అందమైన బొమ్మలా ఉన్నావ్. ఈ మొత్తం గ్రహంలోనే నువ్వు అందమైన అమ్మాయివి. నేను జైల్లోఉండటం వల్ల మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాం. నేను బయటికి వచ్చాక సెలబ్రేట్ చేసుకుందాం. నేను జైలు నుంచి రిలీజ్ అయ్యాక నా మోకాళ్లపై కూర్చుని క్షమాపణలు అడుగుతాను. నిన్ను గట్టిగా హగ్ చేసుకుని నీ కళ్లల్లోకి చూస్తూ మరోసారి నీకు ప్రపోజ్ చేస్తాను. అప్పటివరకు జాగ్రత్తగా ఉండు “” అని లేఖలో పేర్కొన్నాడు.