Odisha Train Accident: జైలు నుంచే 10 కోట్లు దానం చేసిన ఖైదీ

Delhi: రూ.200 కోట్ల దోపిడీ కేసులో శిక్ష అనుభ‌విస్తున్న సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ (sukesh chandrasekhar).. ఒడిశా రైలు ప్రమాద (odisha train accident) బాధితుల కోసం ఏకంగా రూ.10 కోట్లు దానం చేసాడు. పైగా ఆ డ‌బ్బు నిజాయ‌తీగా సంపాదించిన‌దేన‌ని పోలీసులు కూడా తెలిపారు. దిల్లీలోని మండోలీ జైలులో శిక్ష అనుభ‌విస్తున్న సుఖేష్‌.. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్‌కు (ashwini vaishnaw) లెట‌ర్ రాసాడు. రైలు ప్ర‌మాద బాధితుల కోసం త‌న‌కు చేత‌నైనంత సాయం చేస్తాన‌ని తెలిపాడు. నిజాయ‌తీగా సంపాదించిన రూ.10 కోట్లు దానం చేయాల‌నుకుంటున్నాన‌ని, కావాలంటే డ‌బ్బుతో పాటు ట్యాక్స్ క‌ట్టిన‌ట్లు ఉన్న డాక్యుమెంట్లు కూడా పంపుతాన‌ని లెట‌ర్‌లో పేర్కొన్నాడు. గ‌తంలోనూ త‌న బ‌ర్త్‌డే రోజున జైలు ఉన్న ఖైదీల‌కు మెరుగైన స‌దుపాయాలు క‌ల్పించాల‌ని కోరుతూ రూ.5 కోట్లు దానం చేసాడు సుఖేష్. ఆ డ‌బ్బుని బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోలేని వారికి, జైల్లో మ‌గ్గుతూ పిల్లల్ని చ‌దివించుకోలేని వారికి ఇవ్వాల‌ని జైలు సూప‌రింటెండెంట్‌కు లెట‌ర్ రాసాడు.

వివిధ సంస్థ‌ల‌కు చెందిన వ్యాపార‌వేత్త‌ల‌ను మోసం చేసి రూ.200 కోట్ల వ‌ర‌కు దోపిడీకి పాల్ప‌డిన సుఖేష్‌ను అత‌ని భార్యను దిల్లీ పోలీసులు గ‌తేడాది అరెస్ట్ చేసారు. సుఖేష్ బాలీవుడ్ న‌టి జాక్వెలీన్ ఫెర్నాండెజ్‌తో ప్రేమ‌లో ఉన్నాడు. అత‌ను ఓ దోపిడీ దొంగ అని తెలీక జాక్వెలీన్ కూడా సుఖేష్‌ను ఎంతో ప్రేమించింది. అత‌న్ని పెళ్లి కూడా చేసుకోవాల‌నుకుంది. కానీ నిజం తెలిసాక అత‌న్ని దూరం పెట్టింది. అయినా కూడా సుఖేష్ త‌న లాయ‌ర్ సాయంతో జాక్వెలీన్ కోసం లవ్ లెట‌ర్లు రాసి పంపుతున్నాడు.