లింగ మార్పిడి చేయించుకోనున్న మాజీ సీఎం కూతురు
Kolkata: వెస్ట్ బెంగాల్ (west bengal) మాజీ ముఖ్యమంత్రి బుద్దదేవ్ భట్టాచార్య (buddhadev bhattacharya) కుమార్తె సుచేతన (suchetana bhattacharya) లింగ మార్పిడి సర్జరీ చేయించుకోనున్నారు. చాలా కాలంగా ఆమెలో పురుషుడికి సంబంధించిన హార్మోన్స్ ఉన్నాయని, పురుషుడిలాగే జీవించాలనుకుంటున్నానని తెలిపారు. కానీ సమాజం ఏమనుకుంటుందోనని భయపడి ఇన్నాళ్లూ ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదని అన్నారు. లింగ మార్పిడి తర్వాత తన పేరును సుచేతన నుంచి సుచేతన్ అని మార్చుకోబోతున్నారు.
“నా ఫ్యామిలీ ఏమనుకుంటోంది అనేది నాకు అనవసరం. నాకు 41 ఏళ్లు. నేను ఇలా ఉన్నందుకు చాలానే అవమానాలు ఎదుర్కొన్నాను. ఇప్పుడు నేను నాకు నచ్చినట్లు బతకాలని అనుకుంటున్నాను. ఇందులోకి దయచేసి నా తల్లిదండ్రులను లాగొద్దు. మా నాన్నకు చిన్నప్పటి నుంచి ఈ విషయం తెలుసు. అందుకే ఏమీ అనలేదు. ఇది నా నిర్ణయం కాబట్టి నేనే పోరాడతాను. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. ఏమన్నా ఉంటే నన్ను అడగండి ధైర్యంగా సమాధానం చెప్తాను” అని తెలిపారు సుచేతన.