టీచర్‌కి చెందిన అసభ్యకరమైన వీడియో షేర్ చేసిన విద్యార్థులు
Teacher: టీచర్‌తో స్నేహంగా ఉంటున్నట్లు నటించిన ఆమెకు సంబంధించిన అసభ్యకరమైన వీడియోను లీక్ చేసారు విద్యార్థులు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఆగ్రాకు చెందిన ఓ మహిళ మథురాలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో పదో తరగతి చదువుతున్న నలుగురు విద్యార్థులకు ఆ టీచర్ ఎక్స్‌ట్రా తరగతులు పెట్టింది. దాంతో వారికి కోపం వచ్చింది. టీచర్‌తో స్నేహపూర్వకంగా ఉంటున్నట్లు నటిస్తూ ఆమెకు సంబంధించిన అసభ్యకరమైన వీడియోను చిత్రీకరించారు. ఆ వీడియోను టీచర్‌కి చూపించి లైంగిక వాంఛలు తీర్చాలంటూ ఫోర్స్ చేసారు. ఇందుకు ఆమె ఒప్పుకోలేదు. ఆ విద్యార్థులకు దూరంగా ఉండాలనుకుంది. దాంతో వారు రెచ్చిపోయి ఆ వీడియోను ఇతరులకు షేర్ చేసారు. అంతటితో ఆగకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పేజ్ క్రియేట్ చేసి అందులో కూడా ఆ వీడియోను పెట్టేసారు. దాంతో ఆమె స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు.