Kakinada: విద్యార్థుల జడలను కత్తిరించిన హెడ్‌మాస్ట‌ర్

మార్కులు త‌క్కువ‌గా వ‌చ్చాయ‌ని ఓ స్కూల్ హెడ్‌మాస్ట‌ర్ ఏకంగా విద్యార్థుల జుట్టు క‌త్తిరించిన వైర‌ల్ ఘ‌ట‌న కాకినాడ (kakinada) న‌గ‌రంలో చోటుచేసుకుంది. సూర్యనారాయణపురంలోని SNS ఆర్కే పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు మార్కులు తక్కువ వచ్చాయని 9 మంది విద్యార్థులకు జడలను కత్తిరించేసాడు. త‌ల్లిదండ్రులు ఆందోళ‌న చేప‌ట్ట‌గా పోలీసులు వ‌చ్చారు. హెడ్‌మాస్ట‌ర్‌పై కేసు న‌మోదు చేసారు.