టీచర్ లైంగికంగా వేధించిందంటూ విద్యార్థుల లేఖ
Viral News: 50 ఏళ్ల టీచర్ తమను లైంగికంగా వేధించిందంటూ విద్యార్థులు ప్రిన్సిపల్‌కి లేఖ రాయడం అమెరికాలో పెద్ద చర్చకు దారితీసింది. న్యూయార్క్‌లోని డాల్టన్ స్కూల్‌లో మారా అనే మహిళ టీచర్‌గా పనిచేస్తోంది. నిన్న ఈ స్కూల్ ప్రిన్సిపల్ నుంచి మెయిల్ అందింది. అందులో మీరు విద్యార్థులను లైంగికంగా వేధించారని మాకు తెలిసింది. కాబట్టి ఈ కేసు తేలేంత వరకు మీరు సెలవుపై ఉంటే మంచిది అని పేర్కొన్నారు. దాంతో ఆమె దానిని అవమానంగా భావించి రాజీనామా చేసింది.